calender_icon.png 13 November, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాజేడు ఎస్సై ఆత్మహత్య

03-12-2024 01:36:49 AM

  1. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని అఘాయిత్యం
  2. ములుగు జిల్లాలో తీవ్ర కలకలం  

ములుగు(భద్రాద్రి కొత్తగూడెం), డిసెంబర్ 2 (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపా లపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన హరీశ్ 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. ఇటీవలే హరీశ్ వాజేడు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.

కాగా, సోమవారం ఉదయం ఏటూరు నాగారం మండలంలోని గోదావరి సమీపంలో ఓ రిసార్ట్‌లోని గదిలో హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రాణాలు విడిచారు. ఆత్మహత్యకు వ్యక్తిగత సమస్యలే కారణమని ప్రచారం జరుగుతోంది. ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత అంశాలే కారణమని తెలుస్తోంది. కాగా, ఏటూరు నాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైన ఘటన జరిగి 24 గంటలు గడువక ముందే ఎస్సై బలవన్మరణం జిల్లాలో కలకలం రేపింది.