26-12-2025 12:00:00 AM
నాగిరెడ్డిపేట్, డిసెంబర్25 (విజయక్రాంతి): మాజీ ప్రధాని వాజ్పేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బిజెపి నాయకులు అన్నారు. నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో అటల్ బీహార్ వాజ్పేయి జయంతిని మండల బిజెపి నేతలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా దేశ సంరక్షణ కోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత వాజ్పేయి.
గొప్ప కవిగా, దేశభక్తుడిగా దేశం కోసం అహర్నిశలు శ్రమించి, దేశం కోసం సేవ చేసిన మహనీయులు అటల్జీ అని కొనియాడారు. మండల బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు హనుమాన్లు, బాలయ్య, కిషన్, అనిల్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.