calender_icon.png 26 December, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండను ఆదర్శగ్రామంగా చేస్తాం

26-12-2025 12:00:00 AM

నూతన సర్పంచ్ ఐరేని నరసయ్య 

కామారెడ్డి, డిసెంబర్ 25  (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రాన్ని ఆదర్శ గ్రామంగా గుర్తింపు తెచ్చే విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఐరన్ నరసయ్య అన్నారు. గురువారం స్థానిక పద్మశాలి సంఘం వారు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సర్పంచ్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ వార్డు సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పాత తాలూకా కేంద్రమైన దోమకొండకు ఒక ప్రత్యేకత ఉందని దోమకొండ గడికోట కు వినేసుకో గుర్తింపు వచ్చిందని అదే కోవలో దోమకొండ కుడిచెరువు మినీ ట్యాంక్ బండ్ల అభివృద్ధి చేస్తామని గ్రామ పరిసరాలలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఇక్కడి నుండి తరలి వెళ్లిన ఎస్ టి ఓ కార్యాలయం తెప్పించుటకు తన వంతు కృషి చేస్తామన్నారు.

డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కోసం పోరాడుతామన్నారు గ్రామం పెద్దదైనందున సామాజిక పెన్షన్ల పంపిణీ లో పెన్షన్ దారులకు ఇబ్బందులు కలియకుండా పలుగడ్డ ప్రాంతంలో ఒక కౌంటర్ ఏర్పాటుకు అధికారులతో మాట్లాడతామన్నారు గ్రామంలో పరిశుభ్రత నీటి సరఫరా సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తామన్నారు గ్రామంలో నిరుపేదలైన వారికి ఇందిరమ్మ పథకం ద్వారా గృహాలు నిర్మించుకొనుటకు అదనంగా గృహాలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ద్వారా మంజూరు చేయిస్తామని అన్నారు.

దోమకొండలో చేనేత రంగాన్ని పునరుద్ధరించుటకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు తెలంగాణ సమ్మిట్‌లో ఇక్కడికి ఒక పెద్ద ఫ్యాక్టరీ రాబోతుందని ఆయన అన్నారు. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకా శాలు కలుగుతాయని ఆయన సూచించారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించుటలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కలుపుకొని సమిష్టిగా కృషిచేసి దోమకొండకు మంచి పేరు తేవాలని సదుద్దేశంతో తమందరం ఉన్నామని ఎందుకు గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్‌లు  అర్హులందరికీ ఇప్పించడానికి తనవం తుగా కృషి చేస్తామన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో ఈ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మేక నాగరాజ్ కార్యదర్శి బొమ్మల గంగాధర్ కార్యవర్గ సభ్యులు ఉప సర్పంచ్ మాజీ ఉపసర్పంచ్ బెజవాడ శ్రీకాంత్ వార్డు సభ్యులు శేఖర్ లతా రాజేందర్ బత్తిని సిద్ధ రాములు లతో పాటు సంగమేశ్వర ముత్యంపేట గ్రామాలకు చెందిన పద్మ శాలి సంఘం ప్రతినిధులు పాండిదారులు పెద్దమనుషులు యువజన పద్మశాలి సంగం ప్రతినిధులు పాల్గొన్నారు.