calender_icon.png 26 December, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వాజ్‌పేయి జయంతి

26-12-2025 01:21:37 AM

చిట్యాల, డిసెంబర్ 25(విజయ క్రాంతి): భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పాయ్ జయంతి వేడుకలను చిట్యాలలో గురువారం  బీజేపి నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గదేవి గుడి వద్ద  అటల్ బీహారి వాజ్ పాయ్ చిత్ర పటానికి పలువురు బిజెపి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమం లో పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీనివాస్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, పల్లె వెంకన్న, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీనివాస్, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి జయరపు రామ కృష్ణ, గంజి గోవర్ధన్, ఈడుదల మల్లేష్, జోగు శేఖర్, పాల రవి వర్మ, పట్టణ కార్యదర్శి, కన్నె బోయన మురళి కృష్ణ, దామరోజు నాగరాజు, కన్నీబోయన హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మార్గదర్శి మాజీ ప్రధాని వాజ్ పేయి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 25(విజయ క్రాంతి): భారతదేశంలో సుపరిపాలనకు నాంది పలికిన మార్గదర్శి మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయ్ అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కొనియాడారు.గురువారం మండల కేంద్రం అర్వపల్లి లోని వై జంక్షన్ లో వాజ్ పేయ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,నియోజకవర్గం ఇంచార్జీ కడియం రామచంద్రయ్య బీజేపీ నాయకులు ఎల్సోజు దీనదయాల్, మేడబోయిన యాదగిరి,మూల వెంకటరెడ్డి,గిరగాని యాదగిరి,కూర శంకర్,బొడ్డు వీరేందర్,కీర్తి వెంకటేశ్వర్లు,జిన్నె అశ్విన్,చవ్వ సురేష్,శాగంటి నాగరాజు,పొన్నం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్‌లో 

నకిరేకల్ డిసెంబర్ 25 (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గర్రె మురళీమోహన్  ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండల అధ్యక్షులు బుడిగ సైదులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చినేని జానీ, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి గుడికుంట్ల సాయన్న, జిల్లా కౌన్సిల్ సభ్యులు చనగాని రాములు, సీనియర్ నాయకులు జిల్లా డాకయ్య, పుట్ట ఎంకన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి పందాల సైదులు, భువనగిరి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి గాయం మహేష్ రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు ఏర్పుల రేణుక, దొంత పుష్ప, శోభ, యువ మోర్చా నాయకులు మేడిపల్లి శివతో పాటు పార్టీ నాయకులు చందుపట్ల వేణు మాధవ్, కారింగుల యాదగిరి, ఏర్పుల అంజి, నల్లగొండ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.