calender_icon.png 23 December, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

23-12-2025 12:00:00 AM

ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ,  సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మేడ్చల్, డిసెంబర్ 22 సిటీబ్యూరో (విజయక్రాంతి): ఆరు రోజులుగా హైదరాబాద్‌లో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము శీతాకాల విడిదిని ముగించుకుని సోమవారం ఢిల్లీకి వెళ్లారు. హకీంపేట్ విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రేవంత్‌రెడ్డి జ్ఞాపికను అందజేశారు.

మంత్రి సీతక్క, ప్రభు త్వ సలహాదారు వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణ, మేడ్చల్ మల్కాజ్‌గిరి  కలెక్టర్ మనుచౌదరి, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. శీతాకాల విడదికి ఈనెల 17న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ముర్ము ఆరు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.