04-01-2026 12:05:45 AM
సరైన పత్రాలు లేని ౧౫ వాహనాలు గుర్తింపు
కుషాయిగూడ జనవరి 3 (విజయక్రాంతి) : కాప్రా సర్కిల్ లోని కుషాయిగూడ నేరేడుమెట్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సైనిక్‌పురి క్రాస్‌రోడ్డ్ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టా రు. సాయంత్రం రద్దీ సమయాన్ని దృష్టిలో ఉం చుకుని నిర్వహించిన ఈ తనిఖీల్లో మొ త్తం 25 మంది పోలీసులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల ను ఆపి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పీయూసీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 15 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వాహనాల్లో ఇన్సూరెన్స్ గడువు ముగియడం, పీయూసీ సర్టిఫికెట్ లేకపోవడం, లైసెన్స్ లేనివారు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.