calender_icon.png 9 January, 2026 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలి

04-01-2026 12:05:19 AM

కాచిగూడలో విద్యార్థులతో నిరసన

ముషీరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న 11 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మ న్ వేముల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కాచిగూడలో ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి  నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా స్కాలర్షిప్ల కోసం12 లక్షల 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది మాత్రం 2025-26 సంవత్సరానికి 7,45,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు

గత నెల 31న స్కాలర్షిప్ ల దరఖాస్తు గడువు ముగిసిందన్నారు.  స్కాలర్షిప్లు దరఖాస్తు చేసుకునేందుకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ  మొండి వైఖరి వల్ల ఫీజులు కట్టలేక ఉన్నత విద్యకు విద్యార్థులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రణీత,  స్నేహ, అవంతి,  ప్రియాంక, సింధు,  వైష్ణవి, గీత, రమ్య తదితరులు పాల్గొన్నారు.