17-08-2025 12:45:22 AM
రోడ్ సేఫ్టీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం అంటున్న ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): రాష్ర్టంలో వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోటార్ వాహనాల పన్ను చట్టంలోని మూడవ, ఆరవ, ఏడవ షెడ్యూళ్లను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రోడ్డు మౌలిక సదుపాయాలు, రోడ్ సేఫ్టీ మెరుగుదలకు ఈ ట్యాక్స్ పెంపు అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మోటార్ బైక్స్, స్కూటర్లు, ట్రై సైకిళ్లు, కార్లపై వాహన ధర ఆధారంగా ట్యాక్స్ శాతం పెంచారు.
లైఫ్ ట్యాక్స్ పెంపు వివరాలు ద్విచక్రవాహనాలు, ఆటోలు (మూడో షెడ్యూల్) పెంపునకు ముందు
రూ. 50 వేల లోపు 9శాతం
రూ. 50 వేలు దాటితే 12 శాతం
అప్పటికే రిజిస్టర్ అయిన వాటికి వయసును బట్టి ఒక శాతం నుంచి 11శాతం వరకు పెంచిన తర్వాత
రూ.50 వేల లోపు 9 శాతం
రూ.50 వేల నుంచి లక్ష 12 శాతం
రూ.లక్ష నుంచి 2 లక్షలు 15 శాతం
రూ.2 లక్షలు ఆ పైన 18 శాతం
అప్పటికే రిజిస్టర్ అయిన వాటికి వయసును బట్టి ఒక శాతం నుంచి 17 శాతం వరకు సొంత వాహనాలు నాన్ ట్రాన్స్‌పోర్ట్
10 సీట్ల సామర్థ్యం వరకు (ఆరో షెడ్యూల్) పెంపునకు ముందు
రూ.5 లక్షల లోపు 13 శాతం
5 లక్షల నుంచి 10 లక్షల వరకు 14%
10 లక్షల నుంచి 20 లక్షల వరకు 17%
20 లక్షలు ఆ పైబడి 18 శాతం
అప్పటికే రిజిస్టర్ అయిన వాటి వయసును బట్టి
6.5 శాతం నుంచి 17 శాతం వరకు పెంచిన తర్వాత
రూ.5 లక్షల లోపు 13 శాతం
రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు %
రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు 18%
రూ.20 లక్షల నుంచి 50 లక్షల వరకు 20 శాతం
రూ.50 లక్షలు ఆ పైన 21 శాతం
అప్పటికే రిజిస్టర్ అయిన వాటి వయసును బట్టి 6.5 శాతం నుంచి 20 శాతం వరకు కంపెనీలు, సంస్థలు, సొసైటీలకు చెందిన నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు 10 సీట్ల సామర్థ్యం వరకు (ఏడో షెడ్యూల్ ) పెంపునకు ముందు
రూ.5 లక్షల లోపు 14 శాతం
రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 16 %
రూ.10లక్షల నుంచి 20 లక్షల వరకు 19 శాతం
రూ. 20 లక్షలు ఆ పైబడి 20 శాతం
అప్పటికే రిజిస్టర్ అయిన వాటి వయసును బట్టి 8.5 శాతం నుంచి 19 శాతం వరకు పెంచిన తర్వాత
రూ.5 లక్షల లోపు 15 శాతం
రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 16%
రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు 20 శాతం
రూ.20 లక్షల నుంచి 50 లక్షల వరకు 22 శాతం
రూ.50 లక్షలు ఆ పైన 25 శాతం
అప్పటికే రిజిస్టర్ అయిన వాటి వయసును బట్టి 8.5 శాతం నుంచి 24 శాతం వరకు