17-08-2025 12:46:18 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. త్వరలోనే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని తెలిపా రు. మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, మునుగోడు నియోజకవర్గ అభివృ ద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్‌గౌడ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశి క్షణ కమిటీ చూసుకుంటుందని, ఇప్పటికే తాను క్రమశిక్షణ కమిటీని ఆదేశించినట్లు చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డి ఏ ఉద్దేశంతో అ న్నారో తెలుసుకుంటామని చెప్పారు. మా ర్వాడీలు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. దేశంలోని అన్నిరకాల ప్రజలను, కార్మికులను ఆ దుకోవాలని రాహుల్‌గాంధీ బలమైన ఆలోచనతో ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. అసంఘ టిత కార్మికులు అత్యంత శ్రమపడుతారని, కానీ సరియైన గుర్తింపు ఉండదన్నారు.
అ సంఘటిత కార్మికుల శ్రమ ఎక్కువ, ఆదా యం తక్కువ అని, అణగారిన వెనుకబడిన కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది అసంఘటిత కార్మికులేనని తెలిపారు. తెలంగాణలో ఈ కార్మికుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని చె ప్పారు. గతంలోనే అసంఘటిత కార్మికుల సాదక- బాధలు విన్నామన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయి త్వరలోనే సీఎంతో అసంఘటిత కార్మికుల సమావేశం ఏర్పాటు చేస్తా మన్నారు. గాంధీభవన్‌లో జరిగిన అసంఘటిత కార్మిక సంఘం సమావేశంలో కార్మిక సంఘం జాతీయ చైర్మన్ ఉదిత్‌రాజు, ఏఐసీసీ నాయకులు జెట్టి కుసుమకుమార్, కేకేసీ జాతీయ వైస్ చైర్మన్ షేక్ ఇబ్రహీం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ సీనియర్ నేత జగదీశ్వర్‌రావు, రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.