27-08-2025 01:10:09 AM
అలంపూర్ ఆగస్టు, 26:భారతీయ జనతా పార్టీ గద్వాల జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ గా వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం యువ నాయకురాలు స్నిగ్ధ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడు తూ... నాపై నమ్మకం ఉంచిన బిజెపి రాష్ట్ర అధ్యక్షలు రామచంద్రరావు,జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణమ్మ, జిల్లా అధ్యక్షులు రామాంజనేయులుకు మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపా రు.బిజెపి పార్టీ యొక్క కార్యకలాపాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బండల వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.