calender_icon.png 27 August, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ గుర్తింపు ద్వారా పింఛన్ల పంపిణీ

27-08-2025 12:25:28 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఆగస్టు 26 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తపాలా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో పంపిణీ చేసే చేయూత పింఛన్లను ముఖ గుర్తింపు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో డిఆర్డిఓ కిషన్, డీఈఓ యాదయ్యలతో కలిసి తపాలా శాఖ పోస్ట్ మాస్టర్ లకు నూతన మొబైల్స్, 143 మంత్ర ఎల్ 1 డివైస్ లను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో తపాలా శాఖ ఆధ్వర్యంలో పం పిణీ చేసే చేయూత పింఛన్లను ముఖ గుర్తిం పు ద్వారా పంపిణీ చేసేందుకు తపాలా శాఖ పోస్ట్ మాస్టర్‌లకు మొబైల్స్, అనుబంధ పరికరాలను అందించడం జరిగిందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి అంజయ్య, డిపిఎం అన్నాజీ, ఎపిఎం రాజ్ కుమార్, తెలంగాణ ఆన్ లైన్ జిల్లా సమన్వయకర్తలు మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.