calender_icon.png 27 August, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీసీపీ

27-08-2025 12:23:15 AM

యాచారం ఆగస్టు 26  : హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటి పోలీస్ స్టేషన్ ను మంగళవారం మహేశ్వరం జోన్ డిసిపి  డి.సునీత రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పనితీరును మెరుగు పరుచుకోవాలని  సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలను చురుకుగా పరిష్కరిం చడంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని సూచించారు.

రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల వేగవంతమైన దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాల నివారణ, మహిళా భద్రత, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీలో ఇబ్రహీంపట్నం ఏసిపి కెవిపి రాజు, సీఐ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.

పురందరీవాగు చెక్ డ్యామ్‌ను పరిశీలించిన డీసీపీ 

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26: ఇబ్రహీంపట్నం శేరిగూడ పురందరీ వాగు చెక్ డ్యామ్ ను మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసిపి కెపివి రాజు తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ  మాట్లాడుతూ... నిమజ్జనం కోసం చెరువుల వద్దకు తరలివచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. చెరువు కట్టలపై గుంతలను పూడ్చాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారులు చెరువు వద్ద ప్రత్యేకంగా తమ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జనం కార్యక్రమం ముగిసేలా చూడాలని తెలిపారు.

భద్రతా చర్యల గురించి ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డిలు ఒక రూట్ మ్యాప్ లను తయారుచేసి భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.