calender_icon.png 7 May, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే 3 రోజులు వర్షాలు!

07-05-2025 12:00:00 AM

  1. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
  2. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఎండలతో తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని వాతావరణ శాఖ వెల్లడిం చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయ ని తెలిపింది.

ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం వికారాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60కి.మీ. వేగం తో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయి.

గురు వారం ఉమ్మడి వరంగల్, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో, శుక్రవారం ఆదిలాబా ద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, హనుమ కొండ, వికారాబాద్, యాదాద్రి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మంగళవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. అత్యధిక ఉష్ణోగ్రత 41.2 డిగ్రీలు మాత్రమే. రాబోయే 3 రోజుల పాటు ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి.