calender_icon.png 27 August, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి

27-08-2025 12:22:25 AM

ఎస్పీ జానకి షర్మిల 

నిర్మల్, ఆగస్టు  (విజయక్రాంతి): జిల్లాలో నేరాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో లో జిల్లాలో నేరాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో రోజుకు రోజుకు పెరుగుతున్న నేరల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఎస్పీ వాటిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు డిజిటల్ నేరాలు క్రైమ్ నేరాలు ఆర్థిక అసమానతలు పబ్జి గేమ్ గుట్కా మత్తు పదార్థాల నియంత్రణ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులకు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లపై ప్రజలను అప్రపతం చేసి చైతన్యం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రాకేష్ మీనా అవినాష్ కుమార్ ఉపేందర్ రెడ్డి జిల్లాలోని సిఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.