11-09-2025 12:07:36 AM
15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ ఈ నెల 12న రాష్ట్రపతి కార్యాలయంలో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. 67 ఏండ్ల రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్య రాజీనామాతో ఎన్నిక అనివార్యం అయింది.