calender_icon.png 5 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండవ రోజు జోరుగా నామినేషన్లు

05-12-2025 12:52:53 AM

నిర్మల్/కుమ్రంభీం ఆసిఫాబాద్/కుబీర్/ భీమారం(చెన్నూర్), డిసెంబర్ ౪ (విజయక్రాంతి): బైంసా డివిజన్లోని ఆయా మండ లాల్లో ఈ నెల 17న జరిగిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజున గురువారం జోరు గా సాగింది. భైంసా డివిజన్లోని బైంసా తానూరు ముధోల్ బాసర లోకేశ్వరం కుబీర్ మండలంలోని 132ఒక్క గ్రామ పంచాయతీలకు వాటి పరిధిలోని వార్డు మెంబర్లకు నామినేషన్ల ప్రక్రియను నామినేషన్ కేంద్రా ల్లో స్వీకరిస్తున్నారు.

ఆయా గ్రామాల్లో రిజర్వేషన్ల ఆధారంగా సర్పంచ్ అభ్యర్థిత్వం కో సం పోటీ చేసే అభ్యర్థులు తన మద్దతు ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను సం బంధిత అధికారులకు అందజేశారు నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహిస్తోంది. నామినేషన్ల ప్రక్రియను మండలాల అధికారులు పరిశీలించారు.

పొరపాట్లు జరగకుండా చూడాలి

నిర్మల్ జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాటు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా పరిశీలకురాలు ఆయేషా ముసరఫ్, కణం ఉన్నారు. గురువారం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బాక్స్ రా గోదాములను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందజేశారు ఎన్నికల నిర్వ హణపై మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు

నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ 

జిల్లాలో మూడవ విడత చెన్నూర్ నియోజక వర్గంలో కొనసాగుతున్న నామినేషన్ స్వీకరణ కేంద్రాలను గురు వారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. భీమారం మండలంలోని భీమా రం, పోలంపల్లి, ఆరేపల్లి గ్రామాలకు భీమా రం జీపీలో, బూర్గుపల్లి, నర్సింగాపూర్ (బి) గ్రామాలకు బూర్గుపల్లి జీపీలో, దాంపూర్, ధర్మారం, కాజిపల్లి గ్రామాలకు కాజిపల్లి జీపీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఎంపీడీవో మధుసూదన్, జైపూర్ సీఐ నవీన్ లతో కలిసి నామినేషన్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు.

అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అధికారులు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం  కలెక్టరేట్ లో ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్,  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా,  ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణపై మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జిల్లాలో 335 గ్రామపంచాయతీలు, 2 వేల 874 వార్డు స్థానాలకు 3 విడతలలో 87 జోన్ లుగా ఏర్పాటు చేయడం జరిగిందని, జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి రూట్ మ్యాప్, పోలింగ్ కేంద్రాలలో వసతులు, నెట్ వర్క్ పై నివేదికలను ఈ నెల 5వ తేదీ లోగా సమర్పించాలని తెలిపారు. మొదటి విడత ఎన్నికలలో భాగంగా ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలకు రిపోర్టు చేసిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు వారికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల ఎన్నికల సామాగ్రి అందజేసి వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించాలని తెలిపారు.

ఈ నెల 11వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని,  ఫలితాలు వెలువరించి ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించి తిరిగి సిబ్బందిని స్వీకరణ కేంద్రాలకు తీసుకువచ్చే వరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వసతుల కల్పన, భోజన ఏర్పాట్లు చూడాలని తెలిపారు.

మండల ప్రత్యేక అధికారులు తమ మండలంలో పంపిణీ కేంద్రము వద్ద ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి భోజన వసతి, అల్పాహారం ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. నోడల్ అధికారులు ఎన్నికల సామాగ్రి సిబ్బందికి శిక్షణ, వాహనాల ఏర్పాట్లు పర్యవేక్షించాలని, అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఐదుగురు సర్పంచుల ఏకగ్రీవం

ఖానాపూర్, డిసెంబర్ ౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో ఈనెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులు గురువారం ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

మొత్తం 20 సర్పంచ్ స్థానాలు ఉండగా ఐదు ఏకగ్రీవం కాగా తార్లపాడు నుంచి మల్లారెడ్డి, అడవి సారంగాపూర్ నుంచి మాడవి అంకుష్ రావు, కొలంగోడ నుంచి ఆత్రం అర్జున్, మేడమ్‌పల్లి నుంచి రాజేందర్ నాయక్, తండా నుంచి తరుణ్‌బాయ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. ఎన్నికైన వారికి దృపత్రాలను అధికారులు అందజేశారు.

ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

నిర్మల్ జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుమారి కౌముది ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫిస్ లో పలు సూచనలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మూడోదశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటివరకు వివిధ దశల్లో పోటీ చేస్తున్న.

సర్పంచులు వార్డ్ మెంబర్లకు ఎన్నికల నియమాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు గ్రామాల్లో ఎన్నికల కోడ్ నియమాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు జిల్లాలో ముమ్మర తనిఖీలు చేపట్టాలని అన్నారు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతగా పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఎస్పి ఉపేందర్ రెడ్డి డిపిఓ శ్రీనివాస్ ఉన్నారు.