12-12-2025 01:26:22 AM
రైతు కమిషన్‌ను ఆశ్రయించిన రుక్మాపూర్ రైతులు
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : నకిలీ వరి విత్తనాలతో మోసపో యామని, తమకు న్యాయం చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రుక్మాపూర్ రైతులు విజ్ఞప్తి చేశారు. గురువారం రైతు కమిషన్ కార్యాలయానికి వచ్చిన కోదండరెడ్డిని రైతు లు కలిశారు. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీని నమ్మి 40 మంది రైతులు 100 ఎకరాలకు పైగా వరి సాగు చేస్తే ఆశించిన దిగుబడి రాలేదని, పెట్టిన పెట్టుబడి కూడా పోయిందని తెలిపా రు.
సీడ్ కంపెనీ వాళ్లు ఎకరాకు 30 నుం చి 35 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుమతి అవుతుందని, కోత సమయంలో ప్రభుత్వం ఇచ్చే ధరకంటే క్వింటాలకు అదనంగా రూ. 150 చెల్లించి కొనుగోలు చేస్తామని ఆశపెట్టారని రైతు కమిష న్‌కు రైతులు వివరించారు. ఆ నకిలీ విత్తనాలతో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుమతి మాత్ర మే వచ్చిందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారులు ఫీల్డ్‌లోకి పంపి నివేదిక తెప్పించుకుంటానని, ఆ తర్వాత న్యాయం జరిగేలా చూస్తానని కోదండరెడ్డి హామీ ఇచ్చారు.