calender_icon.png 21 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు సర్కార్ ప్రాధాన్యం

21-12-2025 12:18:51 AM

  1. భారత్ ఫ్యూచర్ సిటీలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు
  2. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా 100 ఐటీఐలు
  3. నైపుణ్యం, మానవ విలువలు ఉన్న విద్యను అందించడమే మా లక్ష్యం
  4. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మల్లు 
  5. ఘనంగా లయోలా విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకలు

మేడ్చల్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపడంలో ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా అల్వాల్ లోని లయోలా విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నైపుణ్యం తోపాటు మానవ విలువలు కలిగిన విద్యను అందించడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఇందులో భాగంగా భారత్ ఫ్యూచ ర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం, వీటి ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధితో పాటు రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. సామాజిక ఆసమానతలను రూపుమాపే లక్ష్యంతో అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట ఇంటర్నేషనల్ స్టాండరడ్స్ తో చదువుకునేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు.

ఒక్కో పాఠశాలను 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నా మని, రాష్ట్రంలో 100 పాఠశాలల నిర్మాణానికి మంజూరు చేశాం, శరవేగంగా నిర్మాణా లు జరుగుతున్నాయని తెలిపారు. సమాజంలోనీ వ్యవస్థలు, సంస్థల్లో మార్పు విద్య ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించిన సిపెక్(సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల) సర్వే ద్వారా మరింత స్పష్టమైనదని డిప్యూటీ సీఎం వివరించారు.

ఒక లక్ష్యంతో నడిచే విద్య క్యాంపస్ గోడలను దాటి దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుందని లయోలా అకాడమీ నిరూపిస్తోంది అని ఆయన పేర్కొన్నా రు. పది రోజుల క్రితం తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించాలనే మా లక్ష్యం గురించి నేను మాట్లాడాను. ఆ సందర్భంలో నేను ఒక సరళమైన సూ త్రాన్ని ప్రతిపాదించాను అని డిప్యూటీ సీఎం వివరించారు.

మూలధనం + ఆవిష్కరణ = ఉత్పాదకత. నిజం చెప్పాలంటే, ఆ ఒక్క వాక్యం సమాజంలో ఇంతగా విస్తరిస్తుందని నేను ఊహించలేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. సమ్మిట్ అనంతరం పరిశ్రమ, అకాడమిక్ రంగం, ప్రభుత్వం నుంచి అనేక మంది నన్ను సంప్రదించి,ఆ సమీకరణ మాతోనే ఉండిపోయింది అని చెప్పారు అని డిప్యూటీ సీఎం తెలిపారు.

కొంతమంది అంగీకరించారు, కొంతమంది ప్రశ్నించారు, కానీ ముఖ్యంగా ఆ కొత్త ఉత్పాదకత సూత్రం ఆలోచనను రేకెత్తించింది అని పలు వర్గాలవారు తనతో ప్రస్తావించారని డిప్యూటీ సీఎం తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.