21-12-2025 12:11:35 AM
రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ఘట్‌కేసర్, డిసెంబర్ 20 (విజయక్రాంతి) : పేదింటి యువతుల పెళ్లికి భరో సాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో అండగా నిలబడతాయని రాష్ట్ర శాస న మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అర్హులైన పేద కుటుంబాల యువతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద మంజూ రైన చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్ కేసర్ బంధన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జిల్లా కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ గారు జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి పాల్గొని ఘాట్ కేసర్ మండలంలో 46 మందికి, మేడిపల్లిలో 110 మందికి, కీసరలో 60 మందికి, కాప్రాలో 16 మందికి మూడు చింతలపల్లి మండలంలో 32 మందికి, మేడ్చల్ మండలంలో 86 మంది మొత్తం 350 మంది లబ్ధిదారులకు రూ. 4 కోట్ల 6 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాల్లో పెళ్లిళ్ల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని, ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, నియోజకవర్గ బిబ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్, తుంగతుర్తి రవి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదిరతులు పాల్గొన్నారు.