calender_icon.png 21 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్

21-12-2025 12:12:19 AM

శ్రీవివేకానంద పాఠశాలలో నిర్వహణ

గుమ్మడిదల, డిసెంబర్ 20(విజయక్రాంతి) :గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద హై స్కూల్ లో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో సృజనాత్మకతను శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేందుకు శనివారం పాఠశాల కరస్పాండెంట్ చిమ్ముల జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ చిమ్ముల లతారెడ్డి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిమ్ముల జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి శాయశక్తుల కృషి చేస్తామన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడానికి సుమారు 250కి పైగా ప్రాజెక్టులు ప్రదర్శింపబడ్డాయన్నారు.

ప్రిన్సిపాల్ లతా రెడ్డి మాట్లాడుతూ  పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు   ఉన్నత శిఖరాలకు చేరుకొనే విధంగా తయారు చేయడానికి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం పర్యవేక్షణలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నామన్నారు.  విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఆత్మవిశ్వాసంతో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులకు అర్థమయ్యే రీతిలో వివరించగా, వాటిని తిలకించిన తల్లిదండ్రులు, సందర్శకులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.