21-12-2025 12:14:12 AM
హైదరబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 20 (విజయక్రాంతి): హెఎండీఏ మాస్టర్ ప్లాన్ లో అమాయక, పేదరైతుల పొట్టగొట్టేందుకే ప్రజాపాలన ప్రభుత్వం జోన్ల ఉచ్చు పన్నిందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆగ్రహించారు. జోన్ల ద్వారా అభివృద్ధి ఏమోగానీ రైతుల పాలిట శాపమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, అమాయక, సన్న, చిన్నకారు రైతుల భూములు కన్సర్వేషన్ జోన్‌లోనా? 50 వేల మంది రైతులు తమ భూముల్లో సొంత ఇల్లూ నిర్మించుకునే పరిస్థితీ లేకుండా కాంగ్రెస్ పాలకులు పన్నాగం పన్నారన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడాబాబులు, పలుకుబడి గల వారి భూ ముల్లో ఎన్ని అంతస్తులైనా నిర్మించుకునే అవకాశం కల్పించడంలో సీఎం రేంవత్ రెడ్డి అంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న మాస్టర్ ప్లాన్‌ను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ పరిధిలో రైతుల సమస్యలపై చర్చా వేదికను హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ హైదరాబాద్ మాస్టర్‌ప్లాన్‌లో గత 11 సంవత్సరాలుగా జోన్ల మార్పులకు నోచుకోలేదన్నారు.
లోపభూయిష్టంగా మాస్టర్ ప్లాన్
మాస్టర్ ప్లాన్‌లో అంతా లోపభూయిష్టంగా ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు. భూములను కన్సర్వేషన్ (వ్యవసాయం) పబ్లిక్-సెమీ పబ్లిక్, రిక్రియేషన్, ఓపెన్ స్పేస్, ట్రాఫిక్, రవాణా, పెరి-అర్బన్, రెసిడెన్సియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య), ఇండస్ట్రియల్ (పారిశ్రామిక), మల్టిఫుల్ (బహుళ ప్రయోజన) తదితర జోన్లుగా విభజించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో పేద, అమాయక, సన్న, చిన్నకారు రైతుల భూము లు ఇండ్ల నిర్మాణానికి కూడా అవకాశం లేని కన్సర్వేషన్ లాంటి జోన్లలో కాంగ్రెస్ పాలకులు ఇరికించి, వారికి ఉచ్చు బిగించారని తెలిపారు.
ఈ కారణంగా దాదా పు 50 వేల మంది రైతులు తమ భూముల్లో కూడా సొంత ఇల్లు కూడా నిర్మించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడాబా బులు, పలుకుబడి గల వారి భూములు ఎన్ని అం తస్తులైనా ఇళ్లను నిర్మించుకునే అవకాశం ఉండే రెసిడెన్సియల్, ముల్టీపుల్ జోన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడే ప్రజాపాలన లక్ష్యమేంటో.. పేదలు, ధనవంతుల మధ్య ఉండే అంతరం పెంచిపోషించిన తీరులోనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమేంటో అర్థమవుతుందని అన్నారు.
బడాబాబులు వందల కోట్లకు పడగలెత్తుతుండగా పేదలు పేదవారుగానే మిగిలిపో యేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని వివరించారు. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ఎకరా, రెండెకరాల భూమి ఉన్న రైతులు కూడా సొంత ఇండ్లకు దూరమవుతున్నారని, భూమి ఉన్నా కుటుంబం గడవ ని దయనీయ పరిస్థితి ఉందని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలన్నింటినీ మునిసిపాలిటీలుగా మార్చి జీహెఎంసీలో విలీనం చేశారు.
కానీ రింగ్ రోడ్ లోపల ఉన్న భూములను కన్సర్వేషన్ / ఓపెన్ / రిక్రియేషన్ తదితర జోన్లలో ఉం చడంలో అర్థమే లేదన్నారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న మాస్టర్ ప్లాన్‌ను తక్షణమే మార్చి రైతులకు అనుకూలమైన రీతిలో రూపొందించాలని డిమాండ్‌చేశారు. గ్రోత్ కారిడార్‌లో ప్రతిపాదించిన 100 అడుగుల వెడల్పు గల గ్రిడ్ రోడ్డు విషయంపై పునః పరిశీలన చేయాలని ప్రభుత్వా న్ని కోరారు.
ఈ కార్యక్రమంలో లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఆదర్శ రైతు, పద్మశ్రీ చింతల వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, విశ్రాంత ఐఏఎస్ నిర్మల గోనెల, ఫ్యుటరిస్టిక్ సిటీస్ వ్యవస్థాపకురాలు కరుణ గోపాల్, హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు.