calender_icon.png 29 September, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు లేకున్నా రిజర్వేషన్ అయ్యే

29-09-2025 05:26:57 PM

కామారెడ్డి జిల్లా అంకోల్ గ్రామ పరిస్థితి

రిజర్వేషన్ రద్దు చేయాలని గ్రామస్తుల వినతి 

ఒక్క ఎస్టి కుటుంబం లేదు, ఒక్క ఎస్టి ఓటు లేదు 

ఎస్టీ రిజర్వేషన్ అయినా అంకోల్ జిపి 

కామారెడ్డి (విజయక్రాంతి): ఓటు లేదు, వర్గానికి సంబంధించిన కుటుంబం లేదు, కానీ డ్రా తీయడంతో ఆ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ పరిస్థితి ఇది. తమ గ్రామంలో ఎస్టి ఓటర్ లేడు, ఎస్టీ కుటుంబం లేదు, తమ గ్రామం ఎస్టీ సర్పంచుగా రిజర్వేషన్ కేటాయించడం అన్యాయమని గ్రామస్తులు సోమవారం కామారెడ్డి కలెక్టరేట్కు వచ్చి అదనపు కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. తమ గ్రామానికి వచ్చిన ఎస్టీ సర్పంచ్ రిజర్వేషన్ రద్దుచేసి వేరే రిజర్వేషన్ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. డ్రా తీయడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందని, తమ గ్రామంలో ఎస్టీ కుటుంబాలు లేవని, ఎస్టీ ఓటర్లు లేరని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామం ఎస్టి రిజర్వ్ కావడం విచిత్రంగా ఉందని తెలిపారు.

తమ గ్రామంలో ఎస్టీ కుటుంబాలు లేవని, ఎస్టి ఓటర్లు లేరని గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ రిజర్వేషన్ అయిందని తమకు అవకాశం కోల్పోయామని గ్రామస్తులు కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. ఎస్టీ రిజర్వేషన్ రద్దుచేసి బీసీ, ఎస్సీ, జనరల్ కుటుంబాలు ఉన్నాయని రిజర్వేషన్ తమకు కల్పించాలని కోరారు. ఒక్క ఓటు కూడా లేని గ్రామంలో ఎస్టి రిజర్వేషన్ రావడం తమకు విచిత్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. మాజీ సర్పంచ్ సాయిలు యంసంపై అదనపు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మా గ్రామంలో బీసీ ఎస్టీ ఓసి వర్గాల ఎక్కువగా ఉన్నారని, ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల అంకుల్ గ్రామానికి ఎస్టి రిజర్వేషన్ తొలగించి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన రిజర్వేషన్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలంతా కలిసి ఇదే డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తమకు రిజర్వేషన్ గ్రామంలో ఉన్న ప్రజలను గుర్తించి రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు.