02-05-2025 01:25:12 AM
కలిగించకుండా సత్‌ప్రవర్తనతో ఉండాలి
కొండపాక,మే 01: కొన్ని సంవత్సరాల నుంచి దొంగతనం, ఇతర కేసులలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన వారిపై హిస్టరీ షీట్స్ ఉన్నవారిని గురువారం సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి, వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకుని, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రీటౌన్ సి ఐ విద్యాసాగర్ మాట్లాడుతూ సత్ప్రవర్తన సమాజంలో మంచి పేరు తెచ్చుకొని, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి నేరాలకు పాల్పడని వారి యొక్క హిస్టరీ షీట్స్ కమిషనర్ అనురాధ ఆదేశాలతో వారి నేర ప్రవృత్తి, ప్రవర్తనను బట్టి హిస్టరీ సీట్స్ తొలగించబడునని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని మంచి ప్రవర్తనతో జీవించాలని, సత్ప్రవర్తనను కలిగి ఉన్న వారికి పోలీసుల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, చట్ట ప్రకారం చర్యలు తప్పవని, నిరంతరం నిగా కొనసాగుతుందని సస్పెక్తులపై హిస్టరీ సీట్స్ మైంటైన్ చేస్తున్నామన్నారు.
ఎటువంటి గొడవలు సృష్టించడం, ఇతర వ్యక్తులను రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రవర్తించకూడదని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోకూడనని హెచ్చరించారు.
గంజాయి, మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ చంద్రయ్య, సిబ్బంది నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.