calender_icon.png 2 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులు హక్కుల కోసం పోరాడాలి

02-05-2025 01:23:57 AM

ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు కే రామస్వామి 

చేవెళ్ల, మే 01: కార్మికులంతా ఏకమై తమ హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు కే రామస్వామి పిలుపునిచ్చారు. గురువారం మే డేను పురస్కరించుకొని చేవెళ్లలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జెండాను ఎగురవేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 గంటల పని దినాలను సాధించుకున్న సందర్భంగా  మేడే జరుపుకుంటామని గుర్తుచేశారు.

అయితే  మన దేశంలోని పాలకులు  12 గంటలు పనిచేయాలని చట్టాలను తీసుకురావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డప్పు శివయ్య, కౌన్సిల్ సభ్యులు వడ్ల మంజుల మీనాక్షి, శివ, బిఓసి జిల్లా కార్యవర్గ సభ్యులు జే శ్రీనివాస్, రామచందర్,  పార్టీ సహాయ కార్యదర్శి ఎండి మక్బూల్,  గీత పరిమళ సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో..

  సీఐటీయూ ఆధ్వర్యంలో మేడేను ఘనంగా  నిర్వహించారు. చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి లక్ష్మీ  , శంకర్పల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు జెండాను మల్లేష్ జెండా ఎగరవేశారు. ఆయా కార్యక్రమాల్లో అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు స్వప్న, రాధా,  ట్రాన్స్ పోర్ట్ యూనియన్ మండల ఉపాధ్యక్షుడు యాలాల ప్రభాకర్ రెడ్డి  , శంకర్ పల్లి మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు బిసోల్ల రమేష్, ఉపాధ్యక్షులు సత్యం, మోహన్ కృష్ణ, సహాయ కార్యదర్శులు శ్రీకాంత్ లక్ష్మి పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు మేడ్చల్ లో గురువారం నిర్వహించారు. వివేకానంద విగ్రహం వద్ద ఐఎన్టీయూసీ ఆటో యూనియన్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి, ఐ ఎన్ టి యు సి ఉపాధ్యక్షుడు కంచలపల్లి చంద్రయ్య గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివశంకర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు నడికొప్పు నాగరాజు, కౌడి మహేష్, రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, ఇతర నాయకులు ఉదండపురం సత్యనారాయణ, రామన్న గారి సంతోష్ గౌడ్, కనకాల నాగభూషణం, ఆటో విజయ్ కుమార్, నర్సింగరావు, వెంకటేష్ ముదిరాజ్ శివకుమార్, శ్రీకాంత్ వంజరి, వేముల రంజిత్ రెడ్డి, భాష ,నడికుప్ప రంజిత్ తదితరులు పాల్గొన్నారు.