calender_icon.png 18 September, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడు

18-09-2025 12:35:18 AM

శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

వనపర్తి టౌన్, సెప్టెంబర్ 17 : భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఆయనతోపాటు జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడని చెప్పారు. హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో సృష్టి కర్తగా విశ్వకర్మను పరిగణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, జిల్లా అధికారులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మచారి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.