18-09-2025 12:17:25 AM
లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదొక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన చిత్రం ‘అరుంధతి’. ఈ సినిమాలో అనుష్క.. జేజమ్మగా, అరుంధతిగా కనబరిచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అరుంధతి అంటే అనుష్కనే అనేలా తన పాత్రలో జీవించింది స్వీటి. దర్శకుడు కోడి రామకృష తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం బాక్సాఫిస్ దగ్గర కాసుల వర్షం కురిపించటమే కాకుండా అనుష్క కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలించింది. ఆ తర్వాత అనుష్క చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమా కూడా అరుంధతి స్థాయిని చేరుకోలేకపోయిందనే చెప్పాలి.
ఈ సినిమాను దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రీమేక్ చేశారు కానీ, అనుష్క నటనను, ఆమె రాజసాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు. అయితే, ఆమధ్య హిందీలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని సన్నాహాలు చేశారు. హీరోయిన్‌గా దీపికా పదుకొనెను కూడా ఎంపిక చేశారు. కానీ, ఆ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. మళ్లీ ఇంత కాలానికి హిందీలో అరుంధతి సినిమాను రీమేక్ చేయబోతున్నారనే టాక్ ఇప్పుడు వినవస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం శ్రీలీలను తీసుకోనున్నారని సమాచారం.
భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ రేంజ్ వీఎఫెక్స్‌తో రానున్న ఈ సినిమాను దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నారని అంటున్నారు. మోహన్‌రాజా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’, చిరజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమాలు రూపొందించారు. ఇప్పుడీ దర్శకుడు.. శ్రీలీలను ‘అరుంధతి’గా హిందీ ప్రేక్షకుల పరిచయం చేయాలని చూస్తున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ‘అరుంధతి’ విడుదలైన 14 ఏళ్ల తర్వాత రీమేక్ అవుతున్న ఈ సినిమాను, శ్రీలీలలో ‘అరుంధతి’ని ప్రేక్షకు లు చూసుకుంటారా?! చూడాలి.