calender_icon.png 19 July, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథానాయకుడి సత్యలోక యాత్రే విశ్వంభర

19-07-2025 01:47:25 AM

మెగాస్టార్ చిరంజీవి త్వరలో విశ్వంభర సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కుతుం ది. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయి వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి తర్వాత చాన్నాళ్లకు చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా దర్శకుడు వశిష్ట ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి చెప్తూ అనుకోకుండా కథ లీక్ చేసేశాడు. దీంతో విశ్వంభర స్టోరీ వైరల్‌గా మారింది. డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. “ఫస్ట్ హాఫ్‌లో కొంత టాకీ పార్ట్, మూడు పెద్ద సీక్వెన్సులు ఉంటాయి. సెకండ్ హాఫ్ అసలు కథ మొదలవుతుంది. మనకు 14 లోకాలు ఉన్నాయి.. పైన ఏడు, కింద ఏడు ఉన్నాయి. ఇప్పటివరకు రకరకాలుగా ఆ లోకాలను పలు సినిమాల్లో చూపించారు.

ఈ 14 లోకాలు దాటి సత్యలోకం ఉంటుంది. అది విశ్వంభర లోకంగా నేను చూపించబోతున్నా. హీరో ఈ 14 లోకాలను దాటుకొని నేరుగా సత్యలోకానికి వెళ్తాడు. నా ఊహల్లో ఎలా ఉంటుందో అదే ‘విశ్వంభర’. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి దీనికి సంబంధం లేదు. హీరోయిన్‌ను వెతుక్కుంటూ 14 లోకాలు దాటి సత్యలోకానికి వెళ్లి హీరో ఆమె తెచ్చుకున్నాడనేదే కథ. చాలా వరకు సోషియో ఫాంటసీల్లో ఇదే కథ ఉంటుంది.

హీరోయిన్ కోసమో, లేదా దేని కోసమో వెతుక్కుంటూ వెళ్తారు. ‘విశ్వంభర’కు వెళ్లిన తర్వాత అక్కడ విలన్‌ను చేరే క్రమంలో ఐదు ప్రపంచాలను సృష్టించాం. ఈ ఐదు కూడా పంచ భూతాలను సూచిస్తాయి. మొదట వారం రోజులు చిరంజీవి లేని సీన్స్ షూట్ చేశాం. ఆ తర్వాత చిరంజీవితో షూట్.. ఫస్ట్ రోజు చాలా టెన్షన్ పడ్డాను. సినిమాలో సిద్దుల కొండ అనే ఒక కొండపై శివుడి విగ్రహం ఉంటుంది. చిరంజీవి శివుడికి దండం పెట్టే సీన్ ఆయనతో ఫస్ట్ షూట్ చేశాను” అని తెలిపారు.