11-10-2025 06:51:51 PM
గూడెం మధుసూదన్ రెడ్డి
పటాన్ చెరులో విజె లీగల్ అసోసియేట్స్ కార్యాలయం ప్రారంభం
పటాన్ చెరు: పేదలకు సులభంగా సత్వర న్యాయం అందించేందుకు ప్రైవేట్ లీగల్ అసోసియేట్స్ సంస్థలు కృషి చేయాలని సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎంపీడీవో షాపింగ్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజె లీగల్ అసోసియేట్స్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వాహకులు అడ్వకేట్ విజయభాస్కర్ ను అభినందించారు. అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో కోర్టులు, చట్టాల పట్ల అవగాహన పెంపొందించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, సీనియర్ అడ్వకేట్ యాదగిరి యాదవ్, దస్తగిరి, భాస్కర్ రావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.