05-05-2025 02:13:45 AM
హైదరాబాద్, మే ౪ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిత్యం వందలాది రోడ్డు ప్రమా దాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో చాలా ప్రమాదాలకు నిర్లక్ష్యపు డ్రైవింగే కారణంగా నిలుస్తోంది. దీంతో ఎంతోమంది మృత్యువాత పడుతుండగా.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాలకు మైనర్లు వాహనాలు నడపటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. కనీస వయస్సు లేనివారికి వాహనాలు ఇవ్వ డం..
వారు తెలిసీ తెలియక అతివేగంగా వాహనాలు నడపటం మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ పోలీస్ శాఖ ముందడుగు వేసింది. ముఖ్యం గా మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయడాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.
మైనర్లు డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమవుతుండటంతో అలాంటి వారిపై జరిమానా విధించడం, కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రయాణికులందరికీ సురక్షితమైన రవాణా వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా డ్రైవ్ కొనసాగింది.
1,275 కేసులు.. 35 వాహనాలు సీజ్..
ట్రాఫిక్ రూల్స్, మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా మైనర్లు వాహనాలను నడిపితే ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్య లు తీసుకుంటున్నారు. దీని కోసం ప్రత్యేకం గా డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొ త్తం 1,275 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ 5 నుంచి 22 వరకు నిర్వ హించిన డ్రైవ్‌లో మైనర్లు నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలను నడుపుతూ పోలీసులకు చిక్కారు.
పట్టుబడ్డ 1,275 వాహ నాల రిజిస్ట్రేషన్లు చేయాలని ఆర్టీఏ అధికారులకు లేఖలు కూడా రాశారు. దీనిలో భాగం గా ఇప్పటివరకు 35 వాహనాల రిజిస్ట్రేషన్ల ను ఆర్‌టీఏ అధికారులు రద్దు చేశారు. మైనర్ డ్రైవింగ్ చేసి దొరికిన వారికి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత ఉండదని పోలీసులు స్పష్టం చేశారు.
పర్యవేక్షణ అవసరం..
గతేడాది జూన్‌లో మణికొండ ప్రాంతం లో ఒక మైనర్ బాలుడు కారుతో 20 బైక్‌ల ను ఢీకొట్టి, రోడ్డు పక్కన నిల్చొన్న ఇద్దరినితీవ్రంగా గాయపరిచాడు. ఈ ప్రమాదం మైన ర్ల డ్రైవింగ్‌లో నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది. మాదాపూర్‌లోనూ ఒక మైనర్ బైక్ నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు.
ఈ ఘటనలో వాహనం నడుపుతున్న మైనర్‌తోపాటు వెనక కూర్చొన్న మరో యువకుడు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయితే మైనర్లు వాహనాలు నడుపకుండా అవగాహన కల్పించడంతోపాటు, మైనర్లు వాహనాలు నడుపకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
మైనర్లు డ్రైవింగ్ చేస్తే..
కనీస చట్టపరమైన వయస్సు 50 సీసీ వరకు ఇంజిన్లు కలిగిన మోటార్ సైకిళ్లను నడపడానికి కనీస వయస్సు 16 ఏండ్లు, ఇత ర అన్నీ మోటారు వాహనాలు నడపడానికి 18 ఏండ్లు ఉండాలి. తక్కువ వయస్సుఉన్న డ్రైవర్లు జరిమానాలు మాత్రమే కాకుండా 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందడంలో పరిమితులను కూడా ఎదుర్కొంటారు.
జరిమానా..
భారతదేశంలో మైనర్లు వాహనం నడిపినందుకు విధించే శిక్షలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ సాధారణంగా ఫైన్ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. మైన ర్లు వాహనం నడిపినందుకు విధించే ఫైన్ నే రం తీవ్రతను బట్టి రూ.500 నుంచి రూ. 5,000 వరకు ఉంటుంది. కొన్ని సందర్భా ల్లో, నేరస్తుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంటుంది.
అలాగే వాహనం రిజిస్టర్డ్ యజమానులుగా తల్లిదండ్రులు లేదా సంరక్ష కులు రూ.25,000 వరకు భారీ జరిమానా ను ఎదుర్కోవలసి రావచ్చు. వారి వాహనం మైనర్ డ్రైవర్ చేసిన నేరానికి పాల్పడితే వారికి మూడేండ్ల వరకు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
బాధ్యత యజమానిదే
మైనర్ డ్రైవింగ్ చేసినందుకు విధించే శిక్ష లు డ్రైవర్‌కు మాత్రమే కాకుండా వాహన యజమానికి కూడా వర్తిస్తుంది. మైనర్ వేరొకరికి చెందిన వాహనాన్ని నడుపుతూ పట్టు బడితే, వాహన యజమాని కూడా బాధ్యత వహించడంతోపాటు జరిమానాలనూ చెల్లించాల్సి ఉంటుంది. వాహన యజమానికి రూ.25,000 జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించే అవకాశం లేకపోలేదు. దీంతోపాటు వాహనం రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం పాటు రద్దు చేస్తారు.
తల్లిదండ్రులూ బాధ్యులే
మైనర్ వ్యక్తి వాహనం నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంగా పరిగణించి వారిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది.