calender_icon.png 8 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతారంలో వాలీబాల్ టోర్నమెంట్

02-09-2025 12:00:00 AM

చేవెళ్ల , సెప్టెంబర్ 1 : చేవెళ్ల మండల పరిధి అంతారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆర్.అంజన్న, గ్రామస్తులు బాలన్నగౌడ్, సంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో గ్రామానికి చెందిన 6టీంలు తలపడగా మొదటి బమతి రూ.3 వేలు, రెండో బమతి రూ.2 వేలు, తృతీయ బమతి విజేతలకు రూ.1 వెయ్యి చొప్పున అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆర్.అంజన్న మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడుతాయని, యువత క్రీడలపై ఆసక్తి కనబర్చి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మున్ముందు మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించేందుకు బాధ్యత వహిస్తానన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు బేగరి భూపాల్, శేఖర్, కుమార్, పి.వెంకటేశ్, ఎం.శ్రీనివాస్, ఎం.అనంతరాములు, రాజేందర్, పి.నవీన్, శ్రీను గౌడ్, రాజు గౌడ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరమేశ్వర్, గ్రామస్తులు సీహెచ్.సుధాకర్, బి.రామస్వామి, ప్రవీణ్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు శ్రీశైలం, ఆంజనేయులు గౌడ్, గ్రామ యువకులు పాల్గొన్నారు.