18-12-2025 12:00:00 AM
తుది దశ పోలింగ్లో 84.97% ఓటింగ్ నమోదు
భైంసా కుబీర్ తానూర్( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెళ్లి విరిసింది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పా టు చేయగా ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో సంఖ్య లో తరలివచ్చారు.
ముధోల్ కుబీర్ బాసర తానూర్ దేగాం తదితర పోలింగ్ కేంద్రాల వద్ద ఒంటిగంట సమయం ముగిసినప్పటికీ క్యూలైన్లో వందలాది మంది ఓటర్లు నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు మందకోడిగా ప్రారంభమైన ఓటింగ్ 9 గంటల తర్వాత ఊపందుకోవడంతో 12 గంటల వరకు పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు తమ ఓటు హ క్కును వినియోగించినందుకు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు.
బైంసా మండలంలో 83. 90 బాసరలో 82.87 కుబీర్ లో 84.20 ముధోళ్ళు 83.72 తానూరులో 84.99% ఓటింగ్ నమోదు అయ్యింది జిల్లాలో సరాసరిగా 84.97% ఓటింగ్ అధికారులు ప్రక టించారు. కుబీర్ తానూర్ ముధోల్ బాసర బైంసా మండలాలు మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడంతో ఓటింగ్ శాతం పెంచేలా జిల్లా కలెక్టర్ అధికారులు చేసిన కృషి ఫలించింది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కావా ల్సిన మౌలిక సదుపాయాలను కల్పించారు ముధోల్ మండల కేంద్రంలో ఒకే పాఠశాలలో పదివేల ఓటర్లు ఓటు వేసుకు న్నందుకు ఒక్కసారిగా తరలిరావడంతో ఓటర్లతో కిటకిటలాడింది
తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ
నిర్మల్ జిల్లాలోని 127 గ్రామ పంచాయతీలకు బుధవారం జరిగిన గ్రామపంచా యతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైంసా సబ్ కలెక్టర్ సాయి సాంకేత్ కుమార్ బైంసా కుబీర్ తానూర్ ముధోల్ మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను తనిఖీలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ విధానం అక్కడి వసతులు సిబ్బంది పనితీరు ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు జిల్లా ఎస్పీ జానకి పోలింగ్ కేంద్రాల్లో పోలీసు భద్రతను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు
ఓటర్లు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు వినియో గించుకునేలా రాజకీయ పార్టీలు సర్పంచ్ అభ్యర్థులు అధికారులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూ చించారు అనంతరం నిర్వహించే అభ్యర్థుల కౌంటింగ్ ఫలితాలు ప్రకటించే వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల్లో శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు సామా జిక మాధ్యమాల్లో వస్తున్న అసత్యపు ప్రచారాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని హెచ్చరించారు.
ముధోల్ మండల కేంద్రంలో కలకలం
ముధోల్ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొందరు యువకులు మహిళలు ఓటేసిన శిరచుక్కను తొలగించే కెమికల్ని వెలిగించి మళ్లీ ఓటింగ్ పంపే ప్రయత్నాలను పోలీసులు పసుగట్టి ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఓ వర్గానికి చెంది న అర్ఫావుద్దీన్ మహిళలు ఓటు వేసిన అనంతరం కెమికల్ సాయంతో సిరా చుక్క ను తొలగిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు శిరచుక్క బాటిల్ అతని అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నారు
దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన కొందరిని కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఏఎస్పీ రాజేష్ మీనా రెవిన్యూ అధికారులు ఎన్నికల సిబ్బంది తగి న చర్యలు తీసుకోవడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.