calender_icon.png 23 December, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజువల్స్‌తో వృషభ మెస్మరైజ్ చేస్తుంది

23-12-2025 12:00:00 AM

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న మూవీ ‘వృషభ‘. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తోంది. ‘వృషభ‘ చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమల్ లహోటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘వృషభ‘ సినిమాను దర్శకుడు నందకిషోర్ మలయాళం, తెలుగులో రూపొందించారు.

సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.  కార్యక్రమంలో హీరో సమర్జీత్ లంకేశ్ మాట్లాడుతూ - ‘వృషభ’ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం. అలాగే లవ్, ఫాదర్ సన్ మధ్య ఎమోషన్ కూడా చాలా ఉంటుంది. మోహన్ లాల్ తో నటించేప్పుడు మొదట భయం వేసింది. ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి నటించేలా చేశారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. అలీతో సెట్ లో ఫన్ గా ఉండేది.

ఆయన మంచి బిర్యానీ తీసుకొచ్చేవారు. గీతా ఆరట్స్ తో మా ‘వృషభ‘ సినిమా రిలీజ్ అవుతోంది‘ అన్నారు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ - ‘వృషభ’ ఒక పవర్ ఫుల్ సినిమా. ఈ సినిమాలో నెకట్స్ ఏం జరుగుతుంది అనేది ఊహించలేరు. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఆసక్తిగా చూసేలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మోహన్ లాల్‌లాంటి యాక్టర్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది.

ఈ సినిమాతో నేను మలయాళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాను. భారీ చిత్రంతో నేను మలయాళంలో అడుగుపెడతానని అనుకోలేదు. ఈ సినిమాలో పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. నా క్యారెక్టరే కాదు కథలోని ప్రతి పాత్ర కీలకంగా ఉంటుంది. నందకిషోర్ కథను అలా రాసుకున్నారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలమ్స్, ఎస్ వీ స్టూడియోస్ వంటి బ్యానర్స్ లో నటించడం గర్వంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో నటులు అలీ, సంజయ్ పాల్గొన్నారు.