calender_icon.png 2 October, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారిని దర్శించుకున్న వనపర్తి ఎమ్మెల్యే

02-10-2025 12:00:00 AM

అలంపూర్  అక్టోబర్ 1: దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదవ రోజు అమ్మవారు జోగులాంబ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని స్వామివారి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అంతకంటే ముందు వీరికి ఆలయ ఈవో దీప్తి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ముందుగా స్వామివారాలయంలో అభిషేకం అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. వీరికి ఆలయ ఈవో దీప్తి,అర్చకులు శాలువాతో సన్మానించి ఆలయాల విశిష్టతల గురించి అర్చకులు వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.