02-10-2025 12:00:00 AM
ఆగ్రో రైతు సేవా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ విజయేందిర బోయి
చిన్న చింత కుంట అక్టోబర్ 1 : నిబంధనలు మేరకు రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మండల కేంద్రం లో ఆగ్రో రైతు సేవా కేంద్రం-2 ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు.యూరియా, ఎరువుల స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. పంపిణీ సక్రమంగా జరుగుతుందా తెలుసు కున్నారు. రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని సూచించారు.
ఆగ్రో రైతు సేవా కేంద్రం ద్వారా యూరియా, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కచ్చితంగా రైతులకు రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు కొరత లేకుండా రైతులకు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు, జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్,మండల వ్యవసాయ అధికారి,తదితరులు ఉన్నారు.