calender_icon.png 11 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రవర్ణ భూస్వాములపై యుద్ధం చేయాలి

11-09-2025 01:03:13 AM

-ధర్మసమాజ్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి గూడపర్తి సంతోష్ కుమార్

ముషీరాబాద్, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు అగ్రవర్ణ భూస్వాములపై యుద్ధం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి గూడపల్లి సంతోష్ కుమార్ అన్నా రు. ఈ మేరకు బుధవారం ధర్మ సమాజ్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో  కవాడిగూడ డివిజన్ లో భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాన్ని నడిపించిన వీర వనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ధర్మ సమాజ్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ  ముషీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గూడపర్తి సంతోష్ కుమార్ మాట్లాడుతూ భూస్వాములపై భూమికోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రెడ్డి,  వెలుమ భూస్వా ములపై రాజకీయ యుద్ధం చేసేందుకు  బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ముందుకు రావాలని కోరారు.

ఈ  కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కమల్, బీసీ, ఎస్సీ,  ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో -కన్వీనర్ వినోద్ యాదవ్, ఎరుకల సంఘం అధ్యక్షుడు ముత్యాలు, గౌడ సంఘం నాయకులు నవీన్ గౌడ్, రజక వృత్తిదారుల సంఘం నాయకులు రమేష్, ఆదివాసి తొట్టి సంఘం నాయకులు అత్రం యాదగిరి,  నాయకులు మనోజ్ కుమార్, శివ ప్రసాద్ గౌడ్, శివ శ్రీధర్, జహంగీర్ గౌడ్, కే.  శేఖర్ తదితరులు పాల్గొన్నారు.