calender_icon.png 17 August, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెగిన విద్యుత్ తీగ.. మృతి చెందిన పశువులు

16-08-2025 12:00:00 AM

రాజాపూర్ ఆగస్టు 15 విద్యుత్ ఘాతం తో నాలుగు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన శుక్రవారం తిరుమలగిరిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై ఎస్త్స్ర శివానంద్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలనగర్ మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన జరుపుల హనుమంతు కు చెందిన వ్యవసాయ పొలంలో పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. గత ఎనిమిది నెలల క్రితం ఇతర రాష్ట్రాల నుండి దాదాపు ఒక్కొ క్క పాడిపశువుకు రూ.1.20 లక్షలు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి పాడియావులను షెడ్డులో కట్టేసి ఇంటికి వెళ్ళాడు. 

శుక్రవారం పాల కోసం షెడ్డు దగ్గరికి వెళ్లి చూడగా షెడ్డు దగ్గర ఉన్న విద్యుత్ వైర్ తెగి షెడ్ పై పడడంతో విద్యుత్ ఘాతానికి గురై 4 పాడి పశువులు మృతి చెందాయి. వీటి విలువ రూ.4.80 లక్షలు ఉంటుందని తెలిపారు. బాధిత పాడి రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర వివరాలువెల్లడించారు.