calender_icon.png 11 November, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా డీప్‌ఫేక్ ఫొటోలూ చూశాం

11-11-2025 01:43:36 AM

-ఏఐ దుర్వినియోగంపై సీజేఐ గవాయ్ ఆందోళన

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనాలు, ఇతర డిజిటల్ సాధనాల దుర్వినియోగం పెరుగుతుందని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ చేసిన ‘మా చిత్రాలను నేను కూడా చూశా’ను అని పేర్కొన్నారు.

న్యాయ, పాక్షిక-న్యాయ సంస్థలలో జనరేటివ్ ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించడానికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్)ను సోమవారం విచారిస్తూ చీఫ్ జస్టిస్ ఏఐ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది జడ్జిలు, న్యాయవాదుల మార్ఫింగ్ ఫొటోలు కూడా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఏఐ దుర్వినియోగంపై న్యాయవాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసు విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.