11-11-2025 01:45:55 AM
-లేదంటే మూసివేయిస్తాం
-తయారీ సంస్థలకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబర్ : ఔషధ మందు తయారీ కంపెనీలు తప్పనిసరిగా జనవరి ఒకటో తేదీ నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని లేదంటే కంపెనీలు మూసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గు మందుల వల్ల గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్ తదితర దేశాల్లో మృతి చెందిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తోంది.
ప్రభుత్వ నిబంధనల అమలులో నిర్లక్ష్యం, పాత తయారీ విధానాలు అనుసరిస్తోందంటూ ఆరోపణలు చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం దగ్గు మందు తయారీ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఔషథ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. జనవరి ఒకటి నాటికి ఫార్మాసిటికల్ కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్థరించుకోవాలి.. లేదంటే కంపెనీలు మూసుకోవాల్సిందేనని హెచ్చరించింది. జనవరి ఒకటి నాటికి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి పొడిగింపులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రమాణాలను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి చాలా సమయం ఇచ్చామని హెచ్చరించింది.