24-09-2025 01:07:39 AM
సందీప్ కుమార్ ఝా పై చర్యలు తీసుకోండి
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 23(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను చూస్తే మాకే భయంగా ఉందని హై కోర్ట్ అతని ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్ట పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు చేసింది. హైకోర్టు ఆదేశించినా కూడా నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు.
ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెప్పి కవితపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అక్రమంగా కేసులు నమోదు చేయించాడు. దీనిపై బాధితురాలు కవిత మరోసారి హైకోర్టు ను ఆశ్రయించింది. గతంలో ఇదే పిటిష్ప కోర్టుకు హాజరైనప్పుడు సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ సెన్స్పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా అని కోర్టుకు
వచ్చే పద్ధతి ఇదేనా అంటూ కలెక్టర్ పై తీవ్రంగా మండిపడ్డ హైకోర్టు గతంలో బాధితురాలికి ఇచ్చిన నష్టపరిహారం తీర్పును యధావిధంగా అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఆదేశాలు జారీచేసింది.