calender_icon.png 24 September, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఏడాదిలోగా శాశ్వత పరిష్కారం

24-09-2025 01:06:47 AM

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటన 

ఎల్బీనగర్, సెప్టెంబర్ 23 : నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మంగళవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పర్యటించారు.  బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని హరిహరపురం, స్నేహమై నగర్ కాలనీ, వినూత్న ఎనక్లేవ్, గాంధీనగర్, గాంధీనగర్ సౌత్, అఖిలాండేశ్వరి కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయా కాలనీల్లో పర్యటించి, కాలనీవాసులతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసు కున్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు.

గుర్రంగూడ ఫారెస్ట్ లోని రాగి కుంట నుంచి గాంధీనగర్ -స్నేహమైనగర్ -పీవీర్ కాలనీ -సామ నగర్ నుంచి కుమ్మరి కుంట వరకు వరద కాలువను నిర్మిస్తామని తెలిపారు. దీంతోపాటు హరిహరాపురం చెరువు నుంచి వివేకానంద స్టాట్యూ, శివ సింధు చౌరస్తా, శివాలయం, గౌతమి నగర్ నుంచి బతుకమ్మ కుంట, కుమ్మరి కుంట వరకు వరద కాలువ నిర్మాణం కొరకు ప్రత్తిపాదనలు సిద్ధం చేశామని వివరించారు.

వచ్చే సంవత్సరం వర్షాకాలం వచ్చే లోపు వరద ముంపు సమస్య తీర్చనున్నట్టు కాలనీ వాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరీ, నాయకులు సందీప్ రెడ్డి, కాజా శ్రీనివాస్, రషీద్, నరేశ్, అమర్థ్య, కాలనీ సంఘాల అధ్యక్షులు రామాంజనేయులు, కళ్లెం విష్ణువర్ధన్ రెడ్డి, శంకర్ గౌడ్, మల్లా రెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణ, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.