24-12-2025 01:17:21 AM
సత్తుపల్లి, డిసెంబర్ 23 (విజయ క్రాంతి): ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సం స్థ ను తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సి.ఎం. భ ట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర డి ప్యూ టీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖ ల మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి కా లరీస్ కంపెనీ నూతన జి.ఎం. కార్యాలయ భ వనాన్ని సింగరేణి సంస్థ సి.ఎం.డి. కృష్ణ భా స్కర్, ఎన్.పి.డి.సి.ఎల్ సీఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పో లీస్ కమీషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎ మ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, వైరా ఎ మ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మికుల మధ్య జరుపుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ నూతన జీఎం కార్యాల యం విశాలంగా నిర్మించుకొని నేడు ప్రారంభించామని అన్నారు.సింగరేణి సంస్థ నేడు 45 వేల శాశ్వత ఉద్యోగులు, 40 వేల కాం ట్రాక్టు ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు క ల్పించిందని అన్నారు.
థర్మల్ విద్యుత్ కేం ద్రాలకు అవసరమైన బొగ్గు సరఫరా చేస్తూ ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు సింగరేణి సంస్థ కృషి చేస్తున్నదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యుత్ కేం ద్రాలు బొగ్గు వాడుకోవడం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా మనం సరఫరా చేస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తికే కాకుండా వ్యాపార అవసరాలకు కూడా మనం బొగ్గును సరఫరా చేస్తున్నామని అన్నారు.
బొగ్గు ఉత్పత్తి కంపెనీలు గతంలో ప్రభుత్వ పరంగానే ఉం డేవని, కాలక్రమేణ వచ్చిన మార్పులతో ప్రైవేట్ సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు.బొగ్గు మై న్స్ ఆక్షన్ లో ప్రైవేటు సంస్థలు కూడా పా ల్గొంటున్నాయని, విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నందున పెరిగిన పోటీలో సింగరేణి కాలరీస్ కూడా తట్టుకొని నిలబడాలని అన్నారు. నా ణ్యమైన బొగ్గును మార్కెట్ ధరకు సరఫరా చేయాలని, పోటీని తట్టుకునేలా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి నాణ్యత పెంచుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.
సింగరేణి సంస్థకు మైనింగ్ లో ఉన్న ప్రావీణ్యం మరెవరికి ఉండదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బొగ్గు తవ్వకాల్లకే పరిమితం కాకుండా సింగరేణి సంస్థ మరిన్ని రంగాలలో రాణించాలని డిప్యూటీ సీఎం ఆకాం క్షించారు.గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాలని ప్ర భుత్వం పాలసీలు రూపొందిస్తున్నాయని అ న్నారు. ప్రపంచీకరణలో వస్తున్న మార్పులను సింగరేణి కాలరీస్ సంస్థ అలవ ర్చుకోవాలని, రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ మైనింగ్ వైపు దృష్టి సారించాలని అన్నారు.గ్లోబల్ స్థాయికి ఎదిగాలని, ప్రపం చ వ్యాప్తంగా సింగరేణి జెండా ఎగరాలని డి ప్యూటీ సీఎం అన్నారు.
సింగరేణి విస్తరణ ప్ర పంచ వ్యాప్తంగా జరిగేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. సింగరేణి సంస్థను లాభా ల బాటలో నడిపించాల్సిన బాధ్యత మనందరి పై ఉందని అన్నారు. సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు బ్లాకులపై కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ విధిస్తే బయట ఎవరి చేతిలోకి పోకుండా కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని అన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం జివిఆర్ ఓపెన్ కాస్ట్ మైన్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యుత్ శాఖ ఎస్ ఇ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, సింగరేణి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.