31-12-2025 12:47:42 AM
శివంగి పోలీస్ అక్కతో మంచి గుర్తింపు
ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి
నిర్మల్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే లక్ష్యంతో 2025 సంవత్సరంలో నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ అనేక విజయాలను సాధించి నేరలను తగ్గించడం జరిగిందని జిల్లా ఎస్పీ జారీక్షర్మిల వెల్లడించారు. మంగళవారం నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో 2025 పోలీస్ వార్షిక నివేదికను విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో ప్రజలతో మమేకమై సమాజంలో శాంతి స్థాప న నేరాల తగ్గింపు మత్తు పదార్థాల నియంత్రణ ఆర్థిక నేరాలపై ఈ సంవత్సరం పోలీస్ శాఖ మంచి ఫలితాలను సాధించిందని తెలిపారు.
జిల్లాలో మహిళా పోలీస్ దళంతో ఏర్పాటుచేసిన శివంగి టీం పోలీస్ అక్క మహిళలకు భద్రత ప్రయాణికులకు భరోసా కల్పించడం వల్ల ప్రజల్లో తమపై విశ్వాసం ఏర్పడి నేరాల నేతలకు ప్రజలు సహకరించారన్నారు. వరదలు వచ్చినప్పుడు శివంగి మహిళా దళం ఎంతో సాహసం చేసిందని గుర్తు చేశారు జిల్లాలో 2.16 కోట్ల సెల్ఫోన్లను సాధించడం చేసుకొని బాధితులకు పంపిణీ చేయడం జరిగినది అన్నారు సైబర్ నేరాల కింద 89 లక్షల రికవరీ చేయడం జరిగిందన్నారు.
బాసరలో ఆత్మహత్యల నివారణకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టి వందమంది ప్రాణాలను కాపాడమన్నారు.100 డయల్ కాల్ కు జిల్లాలో స్పందన ఏర్పడిందని తెలిపారు జిల్లాలో ఈ సంవత్సరం 41 62 కేసులు నమోదయాయని, 14 హత్యలు జరిగినట్టు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో 7908 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా పోలీస్‌శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజ ల రక్షణ కోసం సేఫ్టీ డ్రైవింగ్ మైనర్ పిల్లలకు వాహనాల నియంత్రణ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టిన ప్రజలు స్వచ్ఛందంగా తమకు సహకరించడం వలన శాంతి భద్రతల సమస్య ఎక్కడ రాలేదని గ్రామాల్లో సైతం పోలీస్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రాజేష్ మీనా ఉపేందర్ రెడ్డి పత్తిపాటి సాయికిరణ్ సిఐలు పాల్గొన్నారు.