10-01-2026 12:18:29 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,జనవరి 9(విజయ క్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సిఎం కప్ క్రీడా పోటీలలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో జిల్లా యువజన క్రీడా సేవల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సి ఎం కప్ క్రీడలు 2025 టార్చ్ ర్యాలీని జిల్లా ఎస్. పి. నితికా పంత్, జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా యువజన క్రీడల అధికారి అశ్వక్ తో కలిసి కాగడా వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, ,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.