10-01-2026 12:17:21 AM
మేడ్చల్, జనవరి 9 (విజయ క్రాంతి): మేడ్చల్ కలెక్టరేట్లో టీజీవోస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ సతీమణి డాక్టర్ సాయి రాధా మనోహర్ ప్రారంభించారు. ఉద్యోగినులువేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి.
విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ హరిప్రియ, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ జి వినోద్ కుమార్, జిల్లా విద్యాధికారి విజయ కుమారి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీ, లా ఆఫీసర్ చంద్రావతి, డి ఆర్ డి ఓ సాంబశివరావు, టీజీవోస్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తి, కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.