10-01-2026 12:18:46 AM
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య
శామీర్ పేట్, జనవరి 9 (విజయ క్రాంతి):తెలంగాణ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి తెలిపే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవ లక్ష్మి నరసయ్య పేర్కొన్నారు. శామీర్ పేట మండలం అలియాబాద్ మున్సిపల్ పట్టణంలో బిజెపి జిల్లా రూరల్ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూత్ నిర్మల్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ఓట్లను దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాతూరి ప్రభాకర్ రెడ్డి, ఎల్లంపేట జగన్ గౌడ్.సుదర్శన్.హనుమాన్ వివిధ మండలాల అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.