calender_icon.png 27 January, 2026 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి

27-01-2026 12:00:00 AM

మంత్రి పొంగులేటి

రఘనాథపాలెం /ఖమ్మం :జనవరి 26(విజయక్రాంతి): భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు.

ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దేశభక్తుల ఆశయాలు త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగాలి 

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26, (విజయక్రాంతి): దేశభక్తుల ఆశయాలు త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగుతూ స్వాతంత్ర ఫలాలను అర్హులకు అందించేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జతేశ్విని పాటిల్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (ఐ డి ఓ సి) లో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు.  జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం పోలీస్ గౌరవ వందనం నిర్వహించారు. జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు. 

జిల్లా ఎస్పీ కార్యాలయంలో..

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26, (విజయక్రాంతి): భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలు,పోలీసు అధికారులు , సిబ్బందికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ స్వేచ్చ,స్వాతంత్య్రాల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ  రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, జిల్లా కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఆర్‌ఐలు, సీఐలు, ఎస్త్స్రలు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భద్రాచలంలో.. 

భద్రాచలం , జనవరి 26, (విజయక్రాంతి) : భద్రాచలం ఐటిడిఏ కార్యాల యంలో ఐటీడీఏ పీవో రాహుల్ , సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, ఫస్ట్ క్లాస్ కోర్టులో జడ్జి శివ నాయక్, పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నాగరాజు, దేవస్థానం కార్యాలయంలో ఈవో దామోదర్ రావు లు జాతీయ పతాకాలు ఆవిష్కరించి సిబ్బందికి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  భద్రాచలం సెయింట్ పాల్స్ పాఠశాలలో ప్రిన్సిపాల్ కె అబ్రహం, క్రాంతి విద్యాలయంలో కరస్పాండెంట్ సమత శ్రీనివాస్ తో పాటు పలు పాఠశాలలో జాతీయ పతాకాలు ఆవిష్కరించి పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఎర్రుపాలెం  మండలంలో.. 

ఎర్రుపాలెం, జనవరి 26 (విజయక్రాంతి): మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ ఆఫీస్ నందు తాసిల్దార్ మన్నే ఉషా శారద జెండా ఎగరవేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్త్స్ర రవికుమార్ జెండా ఎగరవేశారు. ఎర్రుపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నండ్రు అశ్విని  జెండాఎగరవేశారు. మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచులు జెండా ఎగరవేశారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో, ప్రవేట్ పాఠశాలల్లో జెండా ఎగరవేశారు. స్థానిక ఎస్ జె కే యం జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ నాగిరెడ్డి సౌజన్య జెండా ఎగరవేశారు.  

భాగ్యనగర్ తండాలో 

కారేపల్లి, జనవరి 26( విజయ క్రాంతి): సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ భానోత్ హిరాలాల్ మూడు రంగుల జాతీయ జెండాను ఎగురవేశారు. భాగ్యనగర్ తండా యుపిఎస్ పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు శంకర్, జిపిఎస్ సామ్య తండా స్కూల్ నందు ప్రధానోపాధ్యాయులు బాలాజీ, అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన మూడు రంగుల జెండాను గ్రామ ఉపసర్పంచ్ గూగులోతు బిక్కులాల్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను సర్పంచ్ హిరాలాల్ ఎగురవేశారు. యుపిఎస్ స్కూల్లో నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు గ్రామ సర్పంచ్ బహుమతులను అందజేశారు.   పంచాయతీ సెక్రెటరీ పెండ్ర అనిల్ కుమార్, వార్డు సభ్యులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బందులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

పెద్ద ఎత్తున పతాక ఆవిష్కరణలు

పినపాక, జనవరి 26, (విజయక్రాంతి): జానంపేట జడ్. పి. హెచ్. ఎస్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్యహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పూనం మహేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  

బూర్గంపాడులో 

బూర్గంపాడు, జనవరి26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.  తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ ప్రసాద్,మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జమలారెడ్డి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్‌ఐ మేడా ప్రసాద్, ఐసిడిఎస్ కార్యాలయంలో సీడిపీఓ రేవతి,సీహెచ్ సీ వద్ద సూపర్డెంట్ ముక్కంటేశ్వర్ రావు, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.