calender_icon.png 10 January, 2026 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాద రహిత ప్రయాణం దిశగా సాగాలి

10-01-2026 12:37:11 AM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): రోడ్డుపై వాహనాలు నడుపు తున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రమాద రహిత ప్రయాణం దిశగా సాగాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డిపో మెనేజరు రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ, రవాణా శాఖ, రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు జిల్లా ఎస్పీ నితిక పంత్, జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, జిల్లా ఫైర్ అధికారి భీమయ్య తో కలసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో కీలకమని తెలిపారు. ఆర్టీసీని ప్రమాదాల రహిత ప్రయాణంగా రూపొందించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచిం చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సీతారాం, వైద్యుడు వినోద్ కు మార్, ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.