calender_icon.png 10 January, 2026 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెంలో సంక్షేమ సంబురం

10-01-2026 12:36:35 AM

  1. రూ.22.20కోట్ల సంక్షేమ పథకాల చెక్కులు అందించిన కూనంనేని 
  2. అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యతనిస్తున్నాం
  3. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం , జనవరి 9 (విజయక్రాంతి): పేదవర్గాలకు మునుపెన్నడూ లేనివిధంగా పెద్దమొత్తంలో సంక్షేమ పథకా డబ్బులు మంజూరు కావడంతో కొత్తగూడెం నియోజకవరంలో సంక్షేమ సంబురం నెలకొంది. కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ పథకం లో 201మంది లబ్దిదారులకు మంజూరైన రూ.2.12కోట్ల విలువైన చెక్కులు, అదేవిధంగా చీఫ్ మినిష్టర్ రిలీఫ్ ఫండ్ పథకంలో 50 మందికి మంజూరైన రూ.20.70లక్షల విలువైన చెక్కులను కొత్తగూడెం క్లబ్బులు జరిగిన కార్యక్రమంలో శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు శుక్రవారం అందజేశారు.

ఈ సందర్బంగా జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కు, ప్రజాసంక్షేమ పథకాలకు సమప్రాధాన్యతనిస్తుంన్నామని, పార్టీలకతీతంగా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమపథకాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామన్నారు. పేదకుటుంబాల ఆర్ధికాభిరాన్ని తీర్చేందుకు ప్రభుత్వం సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలుచేయడం అభినంద నీయమన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలు చేరవేయడమే తన బాధ్యతని, ముఖ్యంగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ఆర్థిక భరోసానిస్తుండగా, ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హమాలను పూర్తిస్థాయిలో అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవడం ద్వారా ప్రభుత్వంపై ప్రజలకు పూర్తినమ్మకాన్ని కలిగించాలన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార మే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎస్ కె సాబీర్ పాషా, డిప్యూటీ కలెక్టర్ పానెం కృష్ణ, తహసీల్దార్లు వనం కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ దారా ప్రసాద్, సర్పంచులు, మాజీ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.