calender_icon.png 24 December, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీస్తు సందేశాన్ని ఆచరించాలి

24-12-2025 01:50:41 AM

  1. క్రిస్మస్ వేడుకల్లో టీజీవో కేంద్ర సంఘం 
  2. అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు

ఖమ్మం, డిసెంబర్ 23 (విజయక్రాంతి) తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవా రం ఘనంగా సెమీ క్రిస్మస్ ఉత్సవాలను కొం గర వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, మోదుగు వేలాద్రి, సెక్రెటరీ ఆధ్వర్యంలో టీజీవో భవన్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ హాజర య్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవుడు ఏ విధంగా నడుచుకో వాలో ఏసుక్రీస్తూ ఆచరించి చూపించారని, నేటి కాలంలో అందరూ ఆయన సందేశాన్ని ఆచరిస్తూ శాంతి సౌభాతృత్వాన్ని నెలకొల్పాలని సూచించారు. అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఏలూరి శ్రీనివాసరావు హిం దూ, ముస్లిం, క్రైస్తవ అన్ని మతాలను గౌరవి స్తూ ఉద్యోగులందరూ కలిసిమెలిసి ఉండటానికి ఖమ్మంలోని ఉద్యోగుల కాలనీలలో అన్ని దేవాలయాలను నిర్మించారని చెప్పారు. కార్యక్రమం అనంతరం ఏలూరు శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు.

కార్యక్రమంలో టీజీవో కేంద్ర కమిటీ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, జిల్లా కోశాధికారి సూరంపల్లి రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్, గంగవరపు నరేందర్, హౌస్ బిల్లింగ్ సొసైటీ సెక్రటరీ డా. పి విజయ్ కుమార్, టీజీవో మాజీ అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ, టీజీవో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సంఘం వెంకట పుల్లయ్య,

కార్యదర్శి మహేష్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొనిదెన శ్రీనివాసరావు, రాష్ర్ట బాధ్యులు జైపాల్, గంగవరపు బాలకృష్ణ, ట్రెజరర్ వెంకన్న, మహిళా అధ్యక్షురా లు లలితకుమారి, టీజీవో జిల్లా కార్యవర్గ స భ్యులు శ్రీమతి ఉషశ్రీ, సుధారాణి, విజయ కుమారి, విజయలక్ష్మి  ప్రమీలరాణి, పలు సం ఘాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.