08-11-2025 12:00:00 AM
లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
కల్వకుర్తి టౌన్ నవంబర్ 7 : వర్షాలు ముగిసినా కల్వకుర్తి పట్టణం లోని లోతట్టు కాలనీలో పరిస్థితులు మెరుగవ్వడం లేదు, పట్టణంలోని విద్యానగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలు, నూతనంగా ఏర్పడిన కాలనీలో కూడా మురుగు వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు చెరీ కాలనీ వాసులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఆయా కాలనీలోని అంతర్గత రహదారులు బురదమయంగా ఉండడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నామని, మునిసిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.